: గాయని మధుప్రియ తండ్రి అరెస్టు


గాయని మధుప్రియ తండ్రిని ఈరోజు పోలీసులు అరెస్టు చేశారు. మధుప్రియ భర్త శ్రీకాంత్ అనుకుని పొరబడి వేరే వ్యక్తిని చితకబాదిన కేసులో ఆయన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆయనతో పాటు ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి మహ్మద్ నయిమ్ అనే వ్యక్తిని మధుప్రియ బంధువులు చితకబాదారు. దీంతో సదరు బాధితుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తన భర్త వేధిస్తున్నాడంటూ హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం.. పోలీసుల సమక్షంలో సైకాలజిస్టులు కౌన్సెలింగ్ నిర్వహించడం తెలిసిందే. ఆ మర్నాడు తన భర్తను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ జీవించలేనని, అతనితోనే కలిసుంటానని, తమ తల్లిదండ్రుల మాటల మేరకు తాను శ్రీకాంత్ పై ఫిర్యాదు చేశానని మధుప్రియ ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ పేర్కొనడం విదితమే.

  • Loading...

More Telugu News