: మాతృదేశంపై ప్రేమ లేకుంటే ఇక్కడెందుకు ఉన్నారు?: ఒవైసీపై మండిపడ్డ బీజేపీ నేత


ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి మాతృదేశంపై ప్రేమ లేకుంటే ఇక్కడెందుకు ఉండటం, నచ్చిన చోటుకి వెళ్లిపోవాలని బీజేపీ నాయకుడు ఆర్కేసింగ్ సూచించారు. తన గొంతుపై కత్తి పెట్టినా ‘భారత్ మాతాకీ జై’ అనే నినాదాన్ని చేయనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ పై ఆయన మండిపడ్డారు. కాగా, ఒవైసీపై అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన విషయం తెలిసిందే. ఒవైసీ వ్యాఖ్యలపై శివసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, కాంగ్రెస్ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ మాత్రం ఒవైసీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ మాతాకీ జై’ అనే నినాదాన్ని ఉచ్చరించాలన్న నిబంధనేమీ లేదని, అది వ్యక్తిగత విషయమని అన్నారు.

  • Loading...

More Telugu News