: బహుశ ఆ గుర్రం దేశద్రోహి కావచ్చు, అందుకే ఎమ్మెల్యే కొట్టారు: నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు


డెహ్రాడూన్ లో ఒక పోలీసు గుర్రాన్ని లాఠీతో చితకబాదిన బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి పై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో పాటు ఆయనపై పలు విమర్శలు చేస్తున్నారు. ‘బహుశ ఆ పోలీసు గుర్రం దేశద్రోహి అయి ఉండవచ్చు. అందుకే దానిపై ఎమ్మెల్యే తన ప్రతాపం చూపారు’ అంటూ నెటిజన్లు వ్యంగ్యంతో కూడిన విమర్శలు చేస్తున్నారు. అయితే, ఈ విషయమై సదరు ఎమ్మెల్యే మాత్రం మాటమారుస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సాక్ష్యం ఉన్నప్పటికీ, తాను అక్కడ లేనంటూ సదరు ఎమ్మెల్యే బుకాయిస్తున్నారు. బందోబస్తు నిమిత్తం పోలీసులు ఆ గుర్రాన్ని అక్కడికి తీసుకువచ్చారని, ఎండలో ఉండటం వల్ల అది అలసిపోవడంతో కింద పడిపోయి ఉండవచ్చని, ఆ తర్వాత దానికి సపర్యలు చేసి నీళ్లు తాగించడంతో అది కోలుకుందని, గుర్రానికి ఎటువంటి గాయాలు కాలేదని ఆయన అంటున్నారు. కాగా, మూగజీవిపై విచక్షణా రహితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జంతుహక్కుల సంస్థ పెటా డిమాండ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News