: గుర్రాన్ని కొట్టిన ఎమ్మెల్యే నరకానికి పోవాలి: హీరోయిన్ త్రిష ఘాటు ట్వీట్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో పోలీసు గుర్రంపై విచక్షణా రహితంగా విరుచుకుపడ్డ బీజేపీ ఎమ్మెల్యేపై దక్షిణాది హీరోయిన్ త్రిష మండిపడింది. ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. ఆ బీజేపీ ఎమ్మెల్యే నరకానికి పోవాలని, అక్కడ అతనిని తగలబెట్టాలని తాను ప్రార్థిస్తున్నానంటూ త్రిష ఘాటు ట్వీట్ చేసింది. ఈ సంఘటన చాలా సిగ్గుపడే విషయమని పేర్కొంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి ఆధ్వర్యంలో నిన్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే గణేష్ ఒక పోలీసు గుర్రాన్ని లాఠీతో చితకబాదాడు. ఈ సంఘటనలో గుర్రం కాలు తీవ్రంగా దెబ్బతిందని, దాని కాలు తొలగించాలని వైద్యులు సూచించిన విషయం తెలిసిందే.