: టీ-20ల్లో ఇప్పటివరకూ జరగనిది... నేడైనా జరిగేనా?
మరికొన్ని గంటల్లో టీ-20 విశ్వ క్రీడా సంరంభం మొదలుకానుంది. తొలి మ్యాచ్ నాగపూర్ వీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఇక టీ-20 క్రికెట్ పోటీలు ప్రారంభమైన తరువాత న్యూజిలాండ్ పై ఒక్కసారైనా ఇండియా విజేతగా నిలవలేదు. న్యూజిలాండ్ తో నాలుగు మ్యాచ్ లాడిన భారత్ ఒక్క విజయాన్ని కూడా సొంతం చేసుకోలేకపోయింది. ఈ అంశం న్యూజిలాండ్ కు కలిసొచ్చేది కాగా, ఇప్పుడు స్వదేశీ గడ్డపై వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ మచ్చను తొలగించుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30కి మొదలవుతుంది. ఇండియా జట్టు (అంచనా): రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, ఆశిష్ నెహ్రా, జస్ ప్రీత్ బుమ్రా. న్యూజిలాండ్ జట్టు (అంచనా): మార్టిన్ గుప్తిల్, కేన్ విలియమ్సన్, కొలిన్ మున్రో, కోరీ ఆండర్ సన్, రాస్ టేలర్, గ్రాంట్ ఎల్లియాట్, లూక్ రాంచీ, మిచెల్ స్నాట్నర్, నాథన్ మెక్ కుల్లమ్ / ఇష్ సోథీ, ఆడమ్ మిల్నీ, ట్రెంట్ బౌల్ట్.