: అధికారపక్ష సభ్యుల తప్పులు స్పీకర్ కు కనిపించట్లేదా?: ఎమ్మెల్యే కోటంరెడ్డి


ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ స్పీకర్ కోడెలకు అధికార పక్ష సభ్యుల తప్పులు కనపడట్లేదా? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. స్పీకర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికార పార్టీ సభ్యులు సభలో అసభ్య పదజాలం వాడుతున్నప్పటికీ స్పీకర్ వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఏది మాట్లాడినా తప్పుపట్టేలా స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు ఏమి మాట్లాడాలో కూడా అధికార పక్ష సభ్యులే చెబుతున్నారని విమర్శించారు. తమ పార్టీ సభ్యురాలు రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేశారని, అందుకే స్పీకర్ పై అవిశ్వాసం పెట్టామని కోటం రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News