: జగన్ కారణంగా సభా వ్యవహారాలన్నీ భ్రష్టుపట్టాయి: అచ్చెన్నాయుడు
ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండటంతో సభా వ్యవహారాలన్నీ భ్రష్టుపట్టిపోయానని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. స్పీకర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం గురించి మినహా అన్ని విషయాల గురించి వైఎస్సార్సీపీ మాట్లాడుతోందని, మాట్లాడేందుకు సరుకు లేకపోతే ఊరుకోవాలని ఆయన అన్నారు. "ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే అది వీగిపోయింది, స్పీకర్ పై అవిశ్వాసం పెట్టారు. కానీ, అందులో ఎటువంటి విషయమూ లేదు" అని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులకు తానొక సలహా ఇస్తానని అన్నారు. ‘ఆ సలహా ఏమిటంటే.. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిపై ఆ పార్టీ సభ్యులు అవిశ్వాసం తీర్మానం పెడితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. పట్టిన దరిద్రం వదులుతుంది’ అని అచ్చెన్నాయుడు ఆవేశంగా అన్నారు.