: ఉన్నతోద్యోగులకు 190 శాతం బోనస్ ప్రకటించిన కాగ్నిజంట్


గత సంవత్సరంలో అద్భుత పనితీరును ప్రదర్శించి భారీ లాభాలు నమోదు చేసిన కాగ్నిజంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (సీటీఎస్) సంస్థ ఉన్నతోద్యోగులకు 190 శాతం బోనస్ గా ప్రకటించింది. ఈ సంస్థకు చెందిన 33 శాతానికి పైగా ఉద్యోగులు ఇండియాలోనే పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి సంస్థలో ప్రతియేటా ఉద్యోగుల పనితీరును బట్టి 100 నుంచి 200 శాతం వరకూ బోనస్ లభిస్తుంది. 2014తో పోలిస్తే సీటీఎస్ ఆదాయం 21 శాతం పెరిగి 12.4 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ సంవత్సరం ఆదాయ అంచనా సైతం మెరుగ్గా ఉండటంతో ఉన్నతోద్యోగుల బోనస్ పై అందరికీ ఆనందం కలిగించే నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ సీఈఓ ఫ్రాన్సిస్కో డిసౌజా వెల్లడించారు. మిగతా అందరికీ మెరుగైన బోనస్ లే అందుతాయని తెలిపారు.

  • Loading...

More Telugu News