: టీమిండియా విజయాన్ని కాంక్షిస్తూ ‘ఫ్యాన్ ఆంథెమ్’!... ‘రాయల్ ఛాలెంజ్’ వీడియోలో ధోనీ, కోహ్లీ


ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ‘పొట్టి క్రికెట్’లో తిరుగులేని టీమిండియా ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. భారత్ వేదికగానే జరుగుతున్న ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్ లోనే టీమిండియా, న్యూజిల్యాండ్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ నేటి రాత్రి 7.30 గంటలకు నాగ్ పూర్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ‘మెన్ ఇన్ బ్లూ’ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిన్న ఓ వీడియోను షేర్ చేశాడు. తనతో పాటు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా కనిపిస్తున్న సదరు వీడియోలో... దేశంలో వివిధ ప్రాంతాలు, వివిధ వర్గాలకు చెందిన క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియా విజయాన్ని కాంక్షిస్తున్న వైనం ఆసక్తికరంగా ఉంది. మొత్తం 3 నిమిషాల 9 సెకన్ల నిడివి ఉన్న సదరు వీడియోలో ‘భయం లేకుండా సాగండి’ అంటూ ఫ్యాన్స్ ‘మెన్ ఇన్ బ్లూ’కు చీర్స్ చెబుతున్నారు. ‘ఫ్యాన్ ఆంథెమ్’ పేరిట కోహ్లీ షేర్ చేసిన సదరు వీడియోను ‘రాయల్ ఛాలెంజర్స్ ఎనర్జీ డ్రింక్’ కంపెనీ రూపొందించిందట.

  • Loading...

More Telugu News