: ‘భారత్ మాతా కీ జై’ మాటను పలకనన్న ఓవైసీ నోట... ‘జైహింద్’ మాట!


పీకపై కత్తి పెట్టినా ‘భారత్ మాతా కీ జై’ అన్న పదం తన నోట నుంచి రాదని సంచలన వ్యాఖ్య చేసిన మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నోట... ‘జైహింద్’ మాట వినిపించింది. గతవారం మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ను ఉద్దేశిస్తూ ‘‘భారత్ మాతా కీ జై’’ అన్న పదం తన నోటి నుంచి వినిపించదని ఓవైసీ సంచలన వ్యాఖ్య చేశారు. నిన్న సదరు వీడియో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ అలహాబాదు హైకోర్టులో ఐపీసీ సెక్షన్ 124ఏ కింద ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైందన్న వార్తలు నేటి ఉదయం గుప్పుమన్నాయి. ఈ పిటిషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియకున్నా, ఓవైసీ వేగంగా స్పందించారు. ‘‘నాకు కోర్టు మీద పూర్తి నమ్మకముంది. న్యాయం జరిగి తీరుతుంది. జైహింద్’’ అంటూ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News