: ట్రంప్ గెలవక పోవచ్చు: ఒబామా సంచలన వ్యాఖ్య


తన తదుపరి అమెరికన్ అధ్యక్ష పదవి రిపబ్లికన్ నేతకు దక్కకదని బరాక్ ఒబామా అభిప్రాయపడుతున్నారు. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న డొనాల్ట్ ట్రంప్ విజయం సాధించలేకపోవచ్చని ఒబామా భావిస్తున్నట్టు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రపంచ స్పందనను ప్రతి అమెరికన్ పౌరుడూ నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్న ఒబామా, ఆయన గెలిచే అవకాశాలు లేవని ఒబామా చెప్పినట్టు వైట్ హౌస్ పేర్కొంది. అమెరికన్లు ఆయన్ను నమ్మడం లేదని, ఇదే విషయాన్ని రెండు బహిరంగ సభల్లో ఒబామా స్పష్టం చేశారని ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ గుర్తు చేశారు. ఎంతో సహనం, నేర్పున్న వ్యక్తినే అమెరికన్లు అధ్యక్ష పీఠానికి ఎంపిక చేసుకుంటారని అన్నారు. తనకు తానే ఉచ్చు బిగించుకుంటున్న ట్రంప్, అధ్యక్షుడైతే విదేశాలతో సత్సంబంధాలు కొనసాగించడంలో విఫలమవడం ఖాయమన్నారు. వైట్ హౌస్ నుంచి ఈ తరహాలో ప్రకటన వెలువడటం రిపబ్లికన్ వర్గాల్లో సంచలనానికి కారణమైంది.

  • Loading...

More Telugu News