: టీమిండియాను ఓడిస్తే ‘స్ట్రిప్ డ్యాన్స్’ చేస్తా!: పాక్ జట్టుకు ఆ దేశ మోడల్ ‘హాట్’ ఆఫర్
గతంలో ఓసారి టీమిండియాకు భారత మోడల్ పూనం పాండే బంపర్ ఆఫర్ ప్రకటించింది. కప్ గెలిస్తే న్యూడ్ షో ఏర్పాటు చేస్తానంటూ పూనం చేసిన ప్రకటన నాడు సంచలనం రేపింది. తాజాగా పాకిస్థాన్ లోనూ పూనం పాండే తరహాలోనే ఓ మోడల్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఈ నెల 19న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియాను ఓడిస్తే... యావత్తు పాక్ ప్రజల ముందు ‘స్ట్రిప్ డ్యాన్స్’ చేస్తానంటూ ఆ దేశానికి చెందిన మోడల్ కాందీల్ బాలోచ్ ‘ఘాటు’ ప్రకటన చేసింది. ఈ ప్రదర్శనను పాక్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి అంకితమిస్తానని కూడా ఆమె పేర్కొంది. ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసిన ఓ వీడియోలో బాలోచ్ ఈ మేరకు సంచలన ప్రకటన చేసింది.