: న్యూక్లియర్ వార్ హెడ్ లను ప్రయోగించి చూడండి: కిమ్ జాంగ్


తమ దేశానికి సమీపంలో అమెరికా, దక్షిణ కొరియాలు జరుపుతున్న సైనిక విన్యాసాలను తట్టుకోలేకపోతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, మరోసారి కఠిన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో న్యూక్లియర్ వార్ హెడ్ లను ప్రయోగించి చూడాలని తన సైన్యానికి ఆయన ఆదేశాలిచ్చినట్టు అధికార న్యూస్ ఏజన్సీ 'కేసీఎన్ఏ' పేర్కొంది. ఖండాంతర క్షిపణులకు అణు బాంబులను అమర్చి మరీ పరీక్షించాలన్నది ఆయన ఉద్దేశంగా పేర్కొంది. "ఎంత వేగంతో వెళుతున్నా, వేడి పుట్టని పదార్థాలతో తయారు చేసిన థర్మోడైనమిక్ క్షిపణులను పరీక్షించి చూడండి. మిగతా ఖండాలను దాటి వెళ్లగల రాకెట్ల సామర్థ్యాన్ని పరీక్షించండి. అణ్వాయుధాలతో దాడి చేయాల్సి వస్తే ఏ మేరకు విజయం సాధించగలమో తెలుసుకోండి" అని కిమ్ వ్యాఖ్యానించినట్టు కేసీఎన్ఏ వెల్లడించింది. కిమ్ వ్యాఖ్యలతో కొరియన్ పెనిన్సులాలో మరింత ఉద్రిక్తత ఏర్పడింది.

  • Loading...

More Telugu News