: 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమొరీతో వస్తున్న మైజూ స్మార్ట్ ఫోన్!
ఇప్పటివరకూ 2, 3 జీబీ ర్యామ్ లను కలిగివున్న స్మార్ట్ ఫోన్లను చూశాం. చైనాకు చెందిన వివో సంస్థ 6 జీబీ ర్యామ్ తో ఓ స్మార్ట్ ఫోన్ ను తీసుకువస్తోందని వార్తలు వచ్చినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇక తాజాగా మరో చైనా సంస్థ మైజూ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ప్రో-6 సిరీస్ లో భాగంగా ఇది విడుదలవుతుందని, దీంతో పాటు 4 జీబీ ర్యామ్, 64 జీబీతో సెకండ్ మోడల్ కూడా ఉంటుందని సమాచారం. దీనిలో 1080/1920 పిక్సెల్ డిస్ ప్లే ఉంటుందని, వైఫై తదుపరి వర్షన్ హైఫై 3.0, ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యంతో లభించే ఫోన్ ఫ్లైయ్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ సాయంతో పనిచేస్తుందని తెలుస్తోంది. శాంసంగ్ తయారు చేసిన ఎక్సీనస్ 7420 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇందులో ఉంటుందని సమాచారం. ప్రో-6 సిరీస్ లో ఫోన్ల ధరలు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల మధ్య ఉంటాయని అంచనా.