: చిత్తూరు జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు వెంకన్న భక్తుల దుర్మరణం


ఎపీలోని కృష్ణా జిల్లా గొల్లపూడి వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మెడికోలు సహా ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన సమయానికి కాస్త అటు ఇటుగా చిత్తూరు జిల్లాలోనూ మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుమల వెంకన్న దర్శనానికి వెళుతున్న ఆరుగురు భక్తులు ఈ ప్రమాదంలో చనిపోగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి మండలం అగరాల వద్ద రాయలవారి కోట రెండో మలుపు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో... బెంగళూరుకు చెందిన 15 మంది భక్తులతో తిరుమలకు వెళుతున్న టెంపో ట్రావెలర్ వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News