: చంద్రబాబు భగవంతుడు పంపిన దూత!: బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్య


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును మిత్రపక్షం బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు నిన్న ఆకాశానికెత్తేశారు. చంద్రబాబును ఆయన ఏకంగా ‘దేవుడు పంపిన దూత’గా అభివర్ణించారు. కామన్వెల్త్ డే సందర్భంగా నిన్న అసెంబ్లీ లాబీల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారు. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళతారని ఆశిస్తున్నా’’ అని రాజు అన్నారు. మిత్రపక్షం చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ నిర్ణయించుకున్న మరునాడే రాజు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News