: చూడు తమ్ముడూ... ఖైదీ నెంబరు 6093 నీదే కదా!: జగన్ తో గోరంట్ల సంచలన వ్యాఖ్య


ఏపీ అసెంబ్లీలో నిన్న వైసీపీ... టీడీపీ సర్కారుపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలతో సభ హోరెత్తింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విపక్షంపై విరుచుకుపడగా, విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి... జగన్ ను టార్గెట్ చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్కాముల స్వామి జగన్ ఇంకెవరో స్కాములు చేశారని మాట్లాడటం విడ్డూరంగా ఉందని బుచ్చయ్య వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మరింత స్వరం పెంచిన ఆయన మునుపెన్నడూ లేని విధంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘చూడు తమ్ముడూ! నీ ఖైదీ నెంబరు 6093 కదా! లేదా నేను పొరపాటు పడ్డానా?’’అంటూ సదరు వివరాలున్న ఓ పుస్తకాన్ని చూపుతూ ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News