: కోడెలపై అవిశ్వాసం!... ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు ఇచ్చిన వైసీపీ


ఏపీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాల పరంపర కొనసాగుతోంది. నిన్నటికి నిన్న టీడీపీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టి బోల్తా పడ్డ విపక్ష వైసీపీ... తాజాగా స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఈ మేరకు అవిశ్వాసం నోటీసును వైసీపీ సభ్యులు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు అందజేశారు. ఈ నోటీసుపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.

  • Loading...

More Telugu News