: మూజువాణి ఓటుతో వీగిపోయిన అవిశ్వాసం... శాసనసభ రేపటికి వాయిదా


ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సర్కార్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. సభ్యుల సూచనలతో అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఓటింగ్ చేపట్టారు. మూజువాణి ఓటింగ్ తో వైఎస్సార్సీపీ అవిశ్వాసం వీగిపోయింది. కాగా, బడ్జెట్ పై తొలిరోజు చర్చను స్పీకర్ ప్రారంభించారు. అయితే, వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేబట్టడంతో అసెంబ్లీని రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇదిలాఉండగా, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. ఈ విషయమై క్షమాపణలు చెప్పాలా? వద్దా? అనే విషయాన్ని ఆయన వివేకానికే వదిలివేస్తున్నామని స్పీకర్, అధికార పక్ష సభ్యులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News