: 'యాహూ గేమ్స్'కి ఇక శాశ్వత బ్రేక్
యాహూ గేమ్స్ కి ఇక శాశ్వత బ్రేక్ పడనుంది. త్వరలో యాహూ గేమ్స్, లైవ్ టెక్ట్స్ యాప్, రియల్ టైం వీడియో టెక్ట్సింగ్ యాప్ తదితరాల్ని నిలిపివేయనున్నట్లు యాహూ సంస్థ ప్రకటించింది. వ్యాపారాన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఓ టంబ్లర్ పోస్ట్ ద్వారా తెలిపింది. కొన్ని సర్వీస్‌ల పైనే పూర్తి దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, భారత్‌లో యాహూ ఆస్ట్రాలజీని సైతం మూసివేస్తున్నట్లు పేర్కొంది. ప్రాంతీయ భాషల్లో ఉన్న న్యూస్ సర్వీసులు కూడా ఇకపై అందించబోమని చెప్పింది. ఇకపై యాహూ మెయిల్, సెర్చ్, టంబ్లర్, న్యూస్, స్పోర్ట్స్, ఫైనాన్స్, లైఫ్‌స్టైల్‌ల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయనున్నట్లు సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడు సేవలపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు చెప్పారు.