: ఉత్త‌మ‌ టీ20 బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ


'ఈఎస్ పీఎన్ క్రిక్ ఇన్ఫో-2015' ప్ర‌క‌టించిన అవార్డుల్లో భారత స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ 'ఉత్తమ టీ20 బ్యాట్స్ మెన్' గా ఎంపిక‌య్యాడు. గ‌తంలో దక్షిణాఫ్రికాతో ధర్మశాలలో జరిగిన టీ20 మ్యాచ్ లో రోహిత్ చేసిన 106 పరుగులకుగానూ ఈ అవార్డు ద‌క్కింది. వన్డే, టెస్ట్, టీ20 ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఈ అవార్డులు ఇస్తారు. అయితే, రోహిత్ చేసిన డబుల్ సెంచరీలకుగానూ 2013, 2014 సంవత్సరాల్లో వన్డే విభాగంలో ఉత్తమ బ్యాట్స్ మెన్ గా ఎంపికయిన విషయం తెలిసిందే. ఇక‌, న్యూజిలాండ్ జట్టును ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ వరకు చేర్చినందుకుగానూ మెక్ కల్లంను 'కెప్టెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు వరించింది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లు తీసినందుకుగానూ సౌతీకి 'వన్డే బెస్ట్ బౌలర్' అవార్డు లభించింది. డేవిడ్ వీస్ 'టీ20 బెస్ట్ బౌలర్' అవార్డుకు ఎంపికయ్యాడు. ఇక ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ను 'బెస్ట్ టెస్ట్ బౌలింగ్' అవార్డు వరించింది. ప్రస్తుత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 'బెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్' అవార్డు ద‌క్కించుకున్నాడు. ఏబీ డివిలియర్స్ కు 'వన్డే ఇన్నింగ్స్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News