: ప్రపంచ జల వారోత్సవాలు...సీఎం కేసీఆర్ కు కేంద్రం నుంచి ఆహ్వానం


ఏప్రిల్ 4వ తేదీన జరిగే ప్రపంచ జల వారోత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొనాలంటూ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. ఈమేరకు కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమా భారతి, కేసీఆర్ కు ఫోన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంపై ప్రారంభోత్సవ సదస్సులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ ను ఆమె కోరారు. ఈ పథకానికి కేంద్రం నుంచి నిధులిస్తామని ఆమె హామీ ఇచ్చారు. వివిధ దేశాలు పాల్గొనే ఈ వారోత్సవాల్లో ఆయాదేశాల జల విధానంపై చర్చ జరగనుంది.

  • Loading...

More Telugu News