: నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు: జగన్ కు స్పీకర్ సూచన
శాసనసభలో ఆరోపణలు చేయవచ్చు కానీ, నిరాధారమైన ఆరోపణలు చేయకూడదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్పీకర్ కోడెల శివప్రసాద రావు సూచించారు. ‘సభలో ఆరోపణలు చేయకూడదా? సీబీఐ ఎంక్వయిరీ కోరకూడదా?’ అని ప్రశ్నించిన జగన్ కు స్పీకర్ పైవిధంగా సమాధానమిచ్చారు. విలువైన సభా సమయాన్ని వృథా చేయకుండా, అవిశ్వాసంపై చర్చను పూర్తి చేయాలని జగన్ కు స్పీకర్ సూచించారు.