: ఐఫోన్ 5ఎస్ ధరలను సగానికి సగం తగ్గించే యోచనలో ‘యాపిల్’


ఐ ఫోన్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ నెల 22న ఆవిష్కరించనున్న ఐఫోన్ 5ఎస్ ధరను సగానికి సగం తగ్గించే ఆలోచనలో యాపిల్ సంస్థ ఉన్నట్లు సమాచారం. ఐఫోన్ ఎస్ఈ మోడల్ ప్రమోషన్ లో భాగంగా దీని ధరను తగ్గించాలని సంస్థ యోచిస్తోంది. అమెరికాలో ఐఫోన్ 5ఎస్ ధర మన కరెన్సీలో రూ.30,000 పైగానే ఉంది. ఐఫోన్ ఎస్ఈ లాంచింగ్ అనంతరం ఐఫోన్ 5 ఎస్ రూ.15 వేలకే వినియోగదారులకు అందనున్నట్లు తెలుస్తోంది. ఈ తగ్గింపు ధర కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా, మన దేశంలో కూడా అమలు చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News