: నన్ను ఏ కోర్టులు దోషిగా ప్రకటించాయి?: వైఎస్ జగన్
తనపై ఉన్న అవినీతి కేసుల్లో ఏ కోర్టులు తనను దోషిగా ప్రకటించాయో చెప్పాలని అధికారపక్ష సభ్యులను ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ రూ.43,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటూ అధికారపక్ష సభ్యులు పదేపదే ప్రస్తావించడంపై ఆయన మండిపడ్డారు. ఈ కేసులపై కోర్టులో విచారణ జరుగుతుండగా ఏ ఆధారంతో ఆరోపణలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. మొదట్లో రెండు ఎకరాల భూమి ఉన్న చంద్రబాబునాయుడుకి, 2 లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలంటూ జగన్ డిమాండ్ చేశారు.