: బతికున్నంత వరకూ కలిసే జీవిస్తాం: మధుప్రియ,శ్రీకాంత్ దంపతులు


తాము బతికున్నంత వరకూ కలిసే జీవిస్తామని మధుప్రియ, శ్రీకాంత్ దంపతులు పేర్కొన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్లిద్దరూ మాట్లాడారు. తన తల్లిదండ్రుల వల్లే ఇంత పెద్ద గొడవ జరిగిందని మధుప్రియ చెప్పింది. తన తల్లిదండ్రులతో పాటు మరికొంత మంది కుటుంబసభ్యులు శ్రీకాంత్ గురించి తనకు నూరిపోశారని చెప్పింది. దీంతో, తాను అయోమయ పరిస్థితిలో పడ్డానని చెప్పింది. పోలీసుల సమక్షంలో జరిగిన కౌన్సెలింగ్ అనంతరం వాస్తవ విషయాలు బోధపడ్డాయని చెప్పింది. తన జీవితంలో శ్రీకాంత్ కు తప్ప మరొకరికి స్థానం లేదని మధుప్రియ పేర్కొంది. కాగా, శ్రీకాంత్ మాట్లాడుతూ, మధుప్రియ తల్లిదండ్రులు తనను నమ్మించి తనపై దాడి చేశారని అన్నాడు. మధుప్రియ తల్లిదండ్రుల కారణంగానే ఇంత పెద్ద గొడవ జరిగిందని చెప్పాడు. మధుప్రియతోనే కలిసి ఉంటానని శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా, తన భర్త వేధిస్తున్నాడంటూ హుమాయూన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు నిన్న వాళ్లిద్దరికి పోలీసుల సమక్షంలో సైకాలజిస్టులు కౌన్సెలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News