: ఆర్ఎస్ఎస్ డ్రెస్ కోడ్ మార్పు వెనుక లాలూ భార్య!


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సభ్యుల డ్రెస్ కోడ్ ను మార్చిన విషయం తెలిసిందే. సుమారు 90 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ సభ్యులు నిక్కర్లు ధరిస్తున్నారు. నిక్కర్ల స్థానే ప్యాంట్లను ప్రవేశపెడుతున్నట్లు ఆర్ఎస్ఎస్ నిన్న ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ డ్రెస్ కోడ్ మార్పు వెనుక తన భార్య ఘనత ఉందని అన్నారు. కొన్ని నెలల క్రితం ఆర్ఎస్ఎస్ డ్రెస్ కోడ్ ను తన భార్య తప్పుబట్టిందని ఈ నేపథ్యంలోనే నిక్కర్ల స్థానంలో ప్యాంట్లను ప్రవేశపెడుతున్నట్లు ఆర్ఎస్ఎస్ ప్రకటించిందన్నారు. ఈ ట్వీట్ లో ఒక హెచ్చరికను కూడా లాలూ సంధించారు. అవసరమైతే, ఆర్ఎస్ఎస్ సభ్యులను ప్యాంట్ల నుంచి మళ్లీ నిక్కర్లలోకి మారుస్తామంటూ తనదైన శైలిలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News