: అమ్మ రాసిన చివరి ఉత్తరం అది: సంజయ్ దత్ మొదటి భార్య కూతురు


‘అమ్మను మిస్సయ్యాను’ అంటూ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మొదటి భార్య కూతురు త్రిషాల తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ కుమార్తె త్రిషాల. బ్రెయిన్ ట్యూమర్ తో రిచా శర్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె చివరి రోజుల్లో రాసిన ఒక ఉత్తరాన్ని త్రిషాల సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. తన తల్లి ఆ లేఖ రాసినప్పుడు తనకు ఎనిమిదేళ్ల వయస్సు అని త్రిషాల పేర్కొంది. కాగా, సుమారు 21 ఏళ్ల కిందట రాసిన ఈ లేఖ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ‘డెస్టినేషన్’ అనే టైటిల్ తో ఉన్న ఆ లేఖ... 'మనందరం కలిసి నడుస్తాం.. కానీ, ఎవరి దారి వారిదే.. నేనూ నా మార్గం చూసుకున్నా...' అంటూ బరువైన వాక్యాలతో కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News