: రుణ బకాయిగా ట్రాక్టర్ ను లాక్కుపోతే, ఆత్మహత్య చేసుకున్న బడుగు రైతు!


వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకుని దాన్ని కట్టకుండా ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయే విజయ్ మాల్యా వంటి వారిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉన్నవేళ, రూ. 7 లక్షలు అప్పు తీసుకుని, అందులో రూ. 5.10 లక్షలు చెల్లించి కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ బడుగు రైతుకు. సభ్య సమాజం ముందు ఎన్నో ప్రశ్నలు నిలిపిన ఈ ఘటన తమిళనాడులోని అరియలూరులో జరిగింది. ఓ ప్రైవేటు సంస్థ నుంచి రుణం తీసుకున్న అళగర్ అనే రైతును నడిరోడ్డుపై పోలీసులు చావగొట్టి అతని ట్రాక్టర్ ను రుణ బకాయి కింద తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఊరి ప్రజల ముందు తన పరువు పోయిందని భావించిన ఆళగిరి పురుగుల మందును తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పంట నష్టపోయినందునే తన కుమారుడు రుణ బకాయి చెల్లించలేకపోయాడని, దాదాపు 100 మంది చూస్తుండగా, కొట్టుకుంటూ తీసుకువెళ్లారని, ఇప్పుడు డబ్బు తిరిగి ఇస్తే, తన కొడుకును వెనక్కిస్తారా? అని అళగిరి తండ్రి కన్నీరు కారుస్తూ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు?

  • Loading...

More Telugu News