: కులాలతో ఆడుకుంటున్న చంద్రబాబు: వైఎస్ జగన్


కులాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రజలను మోసగించి బాబు అధికారంలోకి వచ్చారని, టీడీపీ మేనిఫెస్టోలో కులాల గురించి పెట్టేటప్పుడు, పార్లమెంట్ గుర్తుకు రాలేదా? బీసీలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారా? లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలైన తర్వాత కులాల వారీగా చంద్రబాబు టోపీ పెడుతున్నారన్నారు. కాపులకు-బీసీలకు, ఎస్సీలకు-ఎస్సీలకు మధ్య చంద్రబాబు గొడవలు పెడుతున్నారని జగన్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News