: ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డిస్ క్వాలిఫై అవుతారనే అవిశ్వాసం పెట్టాను: జగన్


వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డిస్ క్వాలిఫై అవుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టామని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీలో చేరిన ఆ 8 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి లేదా వారిని డిస్ క్వాలిఫై చేయాలని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో మళ్లీ పోటీ చేయించాలని సవాల్ విసిరారు. తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేలతో నెగ్గుతామని అవిశ్వాసం పెట్టలేదని.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆయన ఇచ్చిన హామీలను మరిచాడని అన్నారు. ప్రజల కష్టాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ప్రజల పక్షాన ప్రతిపక్షం నిలబడుతుందని.. వారి కోసం పోరాడుతుందని అన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని జగన్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News