: వాళ్లను అనర్హులుగా చేయడానికి మనసు రావడం లేదు: జగన్


ఏపీ అసెంబ్లీలో వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చిన సమయంలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన వారిని ఎమ్మెల్యే పదవులకు అనర్హులను చేసేందుకు మనసురావడం లేదని అన్నారు. తమ సభ్యులను ప్రలోభాలు పెట్టిన తెలుగుదేశం నేతలు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తీర్మానం ఇచ్చిన తరువాత 10 రోజుల్లోగా చర్చించే అవకాశాలు ఉన్నప్పటికీ, ఫిరాయింపుదారులను లేకుండా చేసి తక్షణ చర్చకు అనుమతించడం వెనుక కుట్ర ఉందని నిప్పులు చెరిగారు. ఏ ఒక్కరు సంతకం పెట్టినా తీర్మానం తీర్మానమేనని, చర్చకు అనుమతించే ముందు 10 శాతం సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుందని, గతంలో వాజ్ పేయిపై అవిశ్వాసం పెట్టిన సమయంలో సోనియాగాంధీ సంతకం పెట్టలేదని జగన్ గుర్తు చేశారు. శాసనసభా వ్యవహారాల మంత్రి యనమలకు రూల్స్ తెలియకుండా పోయాయని విమర్శించారు.

  • Loading...

More Telugu News