: మాల్యా రావాలన్న ఆదేశాలు లేవు: అటార్నీ జనరల్!


మాల్యా వివాదం ప్రస్తుతానికి సివిల్ కేసుగానే ఉన్నందున విజయ్ మాల్యా తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యాఖ్యానించారు. ఆయన తరఫున లాయర్ అయినా రావచ్చని, అయితే, ఎప్పటికైనా ఆయన ఇండియాకు రావాల్సిందేనని అన్నారు. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు మాల్యాను ఇండియాకు రావాలని గానీ, స్వయంగా కోర్టుకు హాజరు కావాలనిగానీ ఆదేశాలు జారీ చేయలేదని గుర్తు చేశారు. ఆయన ఇండియాకు వచ్చి పాస్ పోర్టును అధికారులకు అప్పగిస్తే మంచిదని సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News