: మాల్యా ఎఫెక్ట్!... ఈడీ విచారణకు ఐడీబీఐ ఉన్నతాధికారులు


కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నిర్వహణ కోసమంటూ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చేసుకున్న రుణ దరఖాస్తుకు సానుకూలంగా స్పందించిన బ్యాంకర్లు తాజాగా తలలు పట్టుకున్నారు. ఎయిర్ లైన్స్ వ్యాపారం కోసం మాల్యాకు ఎస్బీఐ ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియం రూ.7 వేల కోట్ల మేర రుణాలిచ్చింది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఒక్కటే రూ.900 కోట్ల రుణమిచ్చింది. ఈ వ్యవహారంలో మాల్యాకు నిబంధనలను పక్కనబెట్టి ఆ బ్యాంకు రుణం మంజూరు చేసిందన్న ఆరోపణలు గతంలోనే వినిపించాయి. తాజాగా మాల్యా అప్పులెగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో దీనిపై దృష్టి సారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యల దిశగా వేగం పెంచింది. ఇందులో భాగంగా ఆ బ్యాంకుకు చెందిన మాజీ సీఎండీ యోగేశ్ అగర్వాల్ సహా ఆరుగురు ఉన్నతాధికారులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో ఇప్పటికే ఇద్దరు అధికారులను ఈడీ విచారించింది. తాజాగా యోగేశ్ తో పాటు మిగిలిన ముగ్గురు అధికారులు నేడు ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News