: తెలంగాణ లెక్కల పద్దు ఇదే!


బంగారు తెలంగాణ సాధనకు మార్గం వేయడమే లక్ష్యంగా 2016-17 తెలంగాణ బడ్జెట్ ఈ ఉదయం అసెంబ్లీ ముందుకు వచ్చింది. ముచ్చటగా మూడవ సారి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపాదనలు చేశామని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గి, పన్నుల్లో వాటా కూడా కుంచించుకుపోయిందని ఆయన గుర్తు చేశారు. కేంద్రం కేవలం రూ. 450 కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ జీడీపీ గత సంవత్సరం 11.47 శాతంగా నమోదైందని తెలిపారు. మొత్తం బడ్జెట్ రూ. 1,30,415.87 కోట్లని వెల్లడించిన ఈటల, ప్రణాళికా వ్యయం రూ. 67,630.73 కోట్లని, ప్రణాళికేతర వ్యయం రూ. 62,785.14 కోట్లని తెలిపారు. నీటి పారుదల రంగానికి అత్యధికంగా రూ. 25 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పిన ఈటల తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News