: కోల్ స్కాంపై సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్


బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ స్కాంపై నివేదిక వివరాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వినీకుమార్ కు తెలియజేసినట్లు సీబీఐ డైరెక్టర్ వెల్లడించారు. న్యాయశాఖ మంత్రి, బొగ్గు మంత్రిత్వ శాఖలోని కొంతమంది అధికారులు, ప్రధానమంత్రి కార్యాలయం కోరటంవల్లే వివరాలను తెలిపినట్లు రెండుపేజీల అఫిడవిట్ లో తెలిపారు. మరోవైపు ఈ అంశంపై పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతూనే ఉంది.

  • Loading...

More Telugu News