: లండన్ లో అమరావతి ఆఫీస్... రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రి గంటా


బ్రిటన్ రాజధాని లండన్ మహా నగరంలో నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ప్రత్యేక కార్యాలయం తలుపులు తెరచుకుంది. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ సర్కారు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాపసరావు నిన్న లండన్ లో అమరావతి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. లండన్ లోనే అత్యంత కీలక వాణిజ్య కూడలిగా పేరుగాంచిన బకింగ్ హాం ప్యాలెస్ సమీపంలో ఈ కార్యాలయం ఉంది. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు లండన్ లో స్థిరపడ్డ పలువురు ఎన్నారైలతో పాటు అక్కడి పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్న క్రమంలోనే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీఏడీబీ) సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్ తెలిపారు. కార్యాలయం ప్రారంభోత్సవంలో టీడీపీ సీనియర్ నేత, ఎంపీ సీఎం రమేశ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News