: తండ్రికి కవిత పాదాభివందనం!... చల్లంగ ఉండాలని దీవించిన కేసీఆర్!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాదు ఎంపీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నిన్న తన బర్త్ డేను ఘనంగా జరుపుకున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆమె తన తండ్రి కేసీఆర్ పాదాలకు మొక్కి దీవెనలు తీసుకున్నారు. ‘చల్లంగా ఉండు తల్లి’ అంటూ కేసీఆర్ తన కూతురును ఆశీర్వదించారు. ఆ తర్వాత పలువురు పార్టీ నేతల సమక్షంలో కవిత అక్కడే బర్త్ డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ నేతల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి.