: వీపుతట్టి లాలూ కుమారుడిని ప్రశంసించిన మోదీ!
బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వీపు తట్టి ప్రశంసించారు. "లాలూజీ ఆరోగ్యం ఎలా ఉంది"..? అంటూ వాకబు చేశారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తోనూ స్నేహితుడిలా మెలిగి ఉత్సాహంగా గడిపారు. తనను చూడగానే ముందుగా తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం గురించి మోదీ అడిగారని తేజస్వి మీడియాకు తెలిపారు. తొలిసారిగా నిన్ను ప్రత్యక్షంగా చూస్తున్నానని, టీవీలో అప్పుడప్పుడూ చూస్తుంటానని మోదీ తనతో అన్నారని తేజస్వి పేర్కొన్నారు. దీనికి తేజస్వి సమాధానమిస్తూ.. తన సోదరి వివాహ సమయంలో ఒకసారి కలిశామని గుర్తుచేసినట్లు చెప్పారు. 'మీరు నవయువకులు, చాలా చక్కగా పని చేస్తున్నారు, ఇలాగే కొనసాగండ'ని మోదీ తనతో అన్నారని ఆయన చెప్పారు. మోదీ, తానూ కలుసుకున్న సందర్భంగా తేజస్వి యాదవ్ ట్విట్టర్‌లోనూ ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.