: కుప్పకూలిన వేదిక...క్షేమంగా బయటపడ్డ వరుణ్ గాంధీ
భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ ఒక ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో రైతులతో సమావేశమయ్యేందుకని ఈరోజు ఆయన బయలుదేరి వెళుతుండగా మార్గమధ్యంలో ఆగిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది. మొరదాబాద్-హరిద్వార్ జాతీయ రహదారిలో వేచిచూస్తున్న మద్దతుదారులను ఆయన కలిశారు. అనంతరం అక్కడ ఉన్న వేదికపైకి వెళ్లిన ఆయన ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలిపోయింది. అయితే, అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆయనతో పాటు మరో ఎంపీ సర్వేశ్ కుమార్, మొరదాబాద్ మేయర్ కూడా స్టేజ్ పై ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.