: మధుప్రియ-శ్రీకాంత్ కు ముగ్గురు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ ఇప్పించాము: పోలీసు అధికారులు


గాయని మధుప్రియ-శ్రీకాంత్ దంపతులకు ముగ్గురు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించామని హుమాయూన్ పోలీస్ స్టేషన్ అధికారులు పేర్కొన్నారు. కౌన్సెలింగ్ అనంతరం మీడియాతో పోలీసులు మాట్లాడారు. సైకాలజిస్టులు ముగ్గురు కూడా వారిద్దరితో విడివిడిగా మాట్లాడారని చెప్పారు. ప్రస్తుతం తాను షాక్ లో ఉన్నానని, ఆలోచించుకోవడానికి కొన్ని రోజుల సమయం కావాలని కౌన్సెలింగ్ అనంతరం ఆమె చెప్పిందని అన్నారు. ప్రస్తుతానికి తన భర్త శ్రీకాంత్ పై ఎటువంటి లీగల్ యాక్షన్ అవసరం లేదని, తన తల్లిదండ్రులతో కలిసి గోదావరిఖని వెళ్లిపోతానని మధుప్రియ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం ఆమె ఒక అవగాహనకు వచ్చిందని.. ఈ కౌన్సెలింగ్ లో వారి కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నట్లు చెప్పారు. మధుప్రియను శ్రీకాంత్ వేధిస్తున్న విషయం వాస్తవమేనని అన్నారు. మధుప్రియ తనతో పాటు ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని శ్రీకాంత్ వ్యక్తం చేశాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News