: ప్ర‌తి ఒక్క‌రికీ త్వరితగతిన న్యాయం అందించాలి: పెండింగ్‌ కేసులపై రాష్ట్రపతి


ప్ర‌తిఒక్క‌రికీ వేగంగా, స‌రైన న్యాయం అందించే దిశ‌గా న్యాయ‌వ్య‌వ‌స్థ ముందుకు సాగాల‌ని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. అలహాబాద్‌ హైకోర్టు 150వ స్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. కోర్టుల్లో కేసులు దీర్ఘకాలంపాటు పెండింగ్‌లో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేసులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. హైకోర్టుల్లో ఉండాల్సిన 1056 మంది న్యాయమూర్తులకుగాను మార్చి 1వ తేదీనాటికి కేవలం 591 మంది మాత్రమే ఉన్నారని ఆయన తెలిపారు. మ‌న న్యాయస్థానాల్లో ఇప్ప‌టికే పెండింగ్ కేసులు లెక్క‌కు మించిపోయి ఉన్నాయ‌ని అన్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రభుత్వం కలిసికట్టుగా పని చేసి న్యాయం కొనసాగేలా చూడాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి టీఎస్ ఠాకూర్, ఉత్త‌ర ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ రామ్ నాయ‌క్‌, సీఎం అఖిలేశ్ యాద‌వ్‌, వెస్ట్ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ కేస‌రి నాథ్ త్రిపాఠి, అల‌హాబాద్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి డీవై చంద్ర‌చూడ్ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News