: స్కేటింగ్‌లో ఆసియా రికార్డు నెలకొల్పిన ఆరేళ్ల తమిళ బాలిక
పిట్టకొంచెం కూత ఘనం అన్నట్టు తమిళనాడుకు చెందిన ఓ ఆరేళ్ల బాలిక స్కేటింగ్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 41.3 నిమిషాల్లోనే 10.5 కిలోమీటర్ల వరకు వేగంగా స్కేటింగ్ చేసి ఆసియాలో తొలి రికార్డు సృష్టించింది. తమిళనాడులో యువభారతి పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న కె. దర్శిని (6)..విద్యార్థిని క్వార్టర్ స్కేటింగ్ మారథాన్ కార్యక్రమంలో భాగంగా కోయంబత్తూరులో నిర్వహించిన స్కేటింగ్ పోటీలో పాల్గొని అత్యంత వేగంగా స్కేటింగ్ చేసి ఆసియాలో రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు దర్శిని ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 150 బంగారు పతకాలను కైవసం చేసుకుంది. 2014లో నిర్వహించిన కోయంబత్తూరు జిల్లా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా 500 మీటర్ల స్కేటింగ్‌లోనూ సత్తాచాటింది. అదే ఏడాది తమిళనాడు రాష్ట్ర రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లోనూ అద్భుతంగా స్కేటింగ్ చేసి ప్రతిభను కనబర్చింది. గతనెలలో గోవాలో జాతీయ స్థాయిలో టీఎన్‌ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కేటింగ్ పోటీల్లో బంగారు, కాంస్య పతకాలను సాధించింది.