: అవసరమైతే ఇంకా ఎక్కువ వాటర్ తెచ్చుకుంటాం: కేసీఆర్
‘అవసరమైతే, ఇంకెక్కువ టీఎంసీల నీరు తీసుకువస్తాను గానీ, తెలంగాణకు నీళ్లు రాకుండా చేసుకుంటానా?’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ మహారాష్ట్రతో కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందంటూ విపక్షాల ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగానే ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. విపక్షాలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని, ఇది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు తెలంగాణలోని చెరువులన్నింటినీ నాశనం చేశాయన్నారు. 25 వేల చెరువులు అడ్రసు లేకుండా పోయాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ లు పొరుగు రాష్ట్రాలతో ఘర్షణాత్మక ధోరణి అవలంబించాయని, 35 ఏళ్లలో తొలిసారిగా సింగూరు ప్రాజెక్టు ఎండిపోయిందని, ఈ ఏడాది ఎస్ఆర్ఎస్పీకి చుక్కనీరు రాలేదని కేసీఆర్ అన్నారు.