: మధుప్రియ-శ్రీకాంత్ లకు నాలుగు గంటలుగా కౌన్సెలింగ్
గాయని మధుప్రియ, శ్రీకాంత్ లకు నాలుగు గంటలుగా పోలీసుల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. తన భర్త వేధింపులపాలు చేస్తున్నాడంటూ నిన్న హుమాయూన్ పోలీస్ స్టేషన్ లో మధుప్రియ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరికీ డాక్టర్ రాధికా ఆచార్య కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభించిన కౌన్సెలింగ్ ఇంకా కొనసాగుతోంది. వారిద్దరూ విడిపోకుండా ఉండేలా చూసే విషయమై నచ్చచెబుతున్నట్లు సమాచారం. కాగా, సుమారు ఆరు నెలల క్రితం పెద్దలను ఎదిరించి వారు ప్రేమ వివాహం చేసుకున్నారు.