: సింగిల్ షాట్ లో తీసిన సినిమా ఇది: నటుడు శివాజీ


‘సీసా’ చిత్రాన్ని సింగిల్ షాట్ లో తీశామని నటుడు శివాజీ అన్నారు. ఒక ఆర్టిస్టు మొదటి ఫ్రేం నుంచి చివరి ఫ్రేం వరకు ఎక్కడా కట్ అనేది లేకుండా నటించడమంటే ఛాలెంజ్ అని అన్నారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ చిత్రంలో డ్రామా, ఫన్, హర్రర్.. అన్నీ ఉంటాయి. లాంగ్ షాట్, బిగ్ షాట్, వైడ్, టాప్ యాంగిల్, లో యాంగిల్.. ఇలా అన్నీ షాట్లు ఈ చిత్రంలో ఉంటాయి. కానీ, కట్ అనేది మాత్రం ఉండదని శివాజీ అన్నారు. సినిమా ఎన్ని రోజుల్లో తీశారనేది విషయం కాదు... కథలో ఎంత దమ్మున్నదనేదే ముఖ్యమని అన్నారు. ఈ సినిమాలో విశ్రాంతి ఉండదని, కాకపోతే, పాజ్ ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News