: మహ్మద్ అమిర్ బెస్ట్ బౌలర్: పాక్ కెప్టెన్ అఫ్రిది


అంతర్జాతీయ టాప్ పేసర్లలో మహ్మద్ అమీర్ ఒకడని, అతను ఉత్తమ బౌలర్ అని పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది తమ బౌలర్ కు కితాబిచ్చాడు. టీమిండియా బ్యాటింగ్, పాకిస్థాన్ బౌలింగ్ మధ్య ప్రధాన పోరు ఉండనుందని అన్నాడు. తమ బౌలింగ్ పటిష్టంగా ఉందని అఫ్రిది చెప్పాడు. భారత్ పై తమ బ్యాట్స్ మెన్ మంచి స్కోరు సాధిస్తే దానిని కాపాడుకునే సామర్థ్యం తమ బౌలర్లకు ఉందని అఫ్రిది ధీమా వ్యక్తం చేశాడు. కాగా, పాక్ బౌలర్ మహ్మద్ అమీర్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదంటూ టీమిండియా బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అఫ్రిది స్పందించాడు. ఆ వ్యాఖ్యల గురించి రోహిత్ శర్మనే అడగాలని అన్నాడు.

  • Loading...

More Telugu News