: ఆర్ఎస్ఎస్ డ్రెస్ కోడ్ మారింది... నిక్కర్ల స్థానంలో గోధుమ రంగు ప్యాంట్లు


ఇకపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు నిక్కర్ల స్థానంలో గోధుమ రంగు ప్యాంట్లను ధరించనున్నారు. రాజస్థాన్ లోని నాగౌర్ లో జరుగుతున్న అఖిల భారతీయ ప్రతినిధి సభ లో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజి జోషి పేర్కొన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గోధుమరంగు ప్యాంట్లను ఎంపిక చేయడం వెనుక ప్రత్యేకమైన ఉద్దేశమేమిలేదని అన్నారు. ఈ రంగు ప్యాంట్లు చూసేందుకు చక్కగా ఉంటాయని... ఆర్ఎస్ఎస్ కు చెందిన వారిలో అధికశాతం మంది ఈ రంగు వైపే మొగ్గు చూపారని భయ్యాజి చెప్పారు. కాగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గత తొమ్మిది దశాబ్దాలుగా ఖాకీ నిక్కరు, తెల్లని చొక్కా, నల్ల టోపీతో పాటు చేతిలో కర్రతో కనిపిస్తున్నారు. ఇప్పుడు యువతను దృష్టిలో పెట్టుకుని నిక్కర్ల స్థానంలో ప్యాంట్లను తీసుకువచ్చారు.

  • Loading...

More Telugu News