: రెండు రోజుల్లో లక్ష ఫోన్లు అమ్ముడయ్యాయి!
శాంసంగ్ సంస్థ తాజాగా విడుదల చేసిన గెలాక్సీ ఎస్ 7, ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే లక్షకు పైగా ఫోన్లు అమ్ముడుపోయినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అమ్మకాలకు సంబంధించిన వివరాలను సంస్థ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు చెప్పారు. గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ ఫోన్లు శుక్ర, శని వారాల్లో వరుసగా 60 వేలు, 40 వేల ఫోన్లు అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. గెలాక్సీ ఎస్ 7 ధర రూ.48,900, ఎస్ 7 ఎడ్జ్ ధర రూ.56,900 గా ఉంది. భారత మార్కెట్ లోకి గత మంగళవారం వీటిని ప్రవేశపెట్టింది. ఈ నెల 18 నుంచి ఓపెన్ మార్కెట్ లో ఈ రెండు ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా, ఈ రెండు రకాల హ్యాండ్ సెట్స్ గత నెలలో స్పెయిన్ లో ప్రవేశ పెట్టారు.