: వైమానిక దాడుల్లో అల్ ఖైదా ఉగ్రవాదుల హతం


యెమెన్ లో నిన్న అర్ధరాత్రి జరిపిన వైమానిక దాడుల్లో అనుమానిత అల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు. అడెన్ సమీపంలోని అల్ మన్సురా జిల్లాలో ఈ దాడులు జరిగాయి. మొత్తం 20 మంది ఉగ్రవాదులతో పాటు ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడినట్లు భద్రతాధికారులు ధ్రువీకరించారు. కాగా, హౌతి ఉగ్రవాదుల చెరలో ఉన్న అడెన్ నగరాన్ని గత ఏడాది జులైలో సౌదీ మిత్రపక్షాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. దీంతో, అక్కడి భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడులు చేస్తుండేవారు. దీనికి ప్రతిస్పందనగా భద్రతా దళాలు ఉగ్రవాదులపై వైమానిక దాడులకు దిగాయి.

  • Loading...

More Telugu News